కావలి : సెప్టెంబర్ 18 : (మన ద్యాస న్యూస్ ) :///

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ సూచనలు మేరకు యూ.టీ.ఎఫ్. కావలి ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కావలి పట్టణము దక్షిణ శివారులోని బృందావనం కాలనీ సమీపంలో ఉన్న హీరోషోరూందగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్) “రణభేరి ప్రచారజాత” బైక్ ర్యాలీ ప్రారంభమై కావలి పట్టణము ఉత్తర శివారులోని భాష్యం స్కూల్ వరకు నిర్వహించడం జరిగింది.ఈ ప్రచారజాతలో 1.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని 2.ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమములు రద్దు చేయాలనీ 3.పి.ఆర్.సి.కమిటీని వెంటనే నియమించాలనీ,
4.ఉద్యోగులకు 30% ఐ.ఆర్. ప్రకటించాలని 5.ఇతర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు ఉపసంహారించాలని తదితరవిషయాలుమీద ప్రజలుకు అవగాహన కల్పించడంజరిగింది.ఈకార్యక్రమంలో యూ. టీ.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు,జిల్లా గౌరవఅధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు,జిల్లాప్రధాన కార్యదర్శి జి.వి.చలపతిశర్మ, కార్యదర్శిలు ఐ.హెచ్.ఎల్. ప్రసాద్,బి.మాధవరావు, రాష్ట్రఆడిట్ కమిటీ సభ్యురాలు బి.శ్రీదేవి, అన్నీమండలాల బాధ్యులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *