

దుత్తలూరు, సెప్టెంబర్ 17: (మన ద్యాస న్యూస్) :///
దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదాల తిమ్మయ్య గారి తల్లి శ్రీమతి మంగమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు.మంగమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకట రామారావు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.