

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలోని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోంగ్లీ మండలం మొఘ గ్రామ బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఉప సర్పంచ్ నగేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగ్రామ్ పటేల్, సుధాకర్ గౌడ్, సాయి పటేల్, బస్వంత్ పటేల్, రవి పటేల్, తుపాక్వార్ బస్వంత్, మొఘ గ్రామ బీజేపీ పార్టీ నుండి సాయిగొండ, భానుదాస్ పటేల్, గుండప్ప పటేల్, రాసోలే హన్మంత్, వైజు గొండ, సుధాకర్ పటేల్, శివ పటేల్, చంద్రకాంత్, బీఆర్‌ఎస్ పార్టీ నుండి మాజీ స్కూల్ చైర్మన్ యదు గొండ, శంకర్, సాయిగొండ, సందీప్, వీరేష్, దశరథ్, మహబూబ్, షేక్ అహ్మద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.