అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక

వెదురుకుప్పం,మన ధ్యాస,  సెప్టెంబర్ 7 :
జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం వెదురుకుప్పం మండలం కొమరికుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామస్తులపై  క్వారీ యాజమాన్యం దౌర్జన్యం చేయడం అత్యంత కిరాతక చర్య అని అన్నారు. క్వారీ యాజమాన్యంపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కూడా రైతులకు అండగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు తావులేదని చెప్పారు. నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమాలను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మంత్రి అనిత దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. కాగా రైతులు విజ్ఞప్తులను కాదని క్వారీ యజమానికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల పట్టా భూముల్లో అక్రమంగా ప్రవేశించి దారి ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం అన్నారు. అక్రమంగా రైతుల భూముల్లో ప్రవేశించిన క్వారీ యాజమాన్యాన్ని వదిలి పెట్టి అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం వెనుక ఎవరి ఒత్తిడి, హస్తం ఉందో పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గ్రామాల సమీపంలో క్వారీలకు అనుమతి ఇవ్వడం, గ్రామాల మద్యలో టిప్పర్లు ట్రాక్టర్లతో గ్రానైట్ తోలడం చట్ట విరుద్ధం అన్నారు. నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమాలను పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తానని సుధాకర్ రెడ్డి తెలిపారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..