

శంఖవరం/రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా తుని, పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం చెందిన వాసిరెడ్డి జగన్నాధం (జమిల్)నుపార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు)”నియమించడమైనది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను తుని, పెద్దాపురం వీరికి కేటాయించడమైనది. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, సంబంధింత రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారు. జమిల్ మాట్లాడుతూ, నాకు ఇంత చక్కనైన అవకాశం ఇచ్చిన నా దేవుడు జగన్ మోహన్ రెడ్డి నా ధన్యవాదములు తెలియచేసుకుంటున్న అని అలాగె ఇప్పటికి ఎప్పటికి కూడ జగన్ అన్న తోనే నా ప్రయాణం అని పార్టీ అభివృద్ధి మరింత విదంగా కృషి చేస్తాను అని తెలియచేసారు.