

మన న్యూస్, ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రజల కోసం తపేతన కృషి చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు 16.3 కోట్ల రూపాయలను ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా గ్రామపంచాయతీ భవనాలు అంగన్వాడి కేంద్రాలు సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మన న్యూస్ దినపత్రికకు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లోని సమస్యలు లేని గ్రామాలుగా చూడడమే ఎమ్మెల్యే లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవకముందే ప్రతి గ్రామాలలో అభివృద్ధి బాటలో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.