

వింజమూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 22 :///
నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం వింజమూరు యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో గ్రావెల్ ను తరలిస్తున్న ప్రాంతాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇరిగేషన్ ఈ ఈ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి పర్మిషన్ తీసుకొని తరలిస్తున్నారని, ఇప్పటివరకు ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారని, మిగతాది తరలిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని సుమారు 145 చెరువుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. చెరువులన్నిటికీ అధ్యక్షులను నియమించడం జరిగిందని, వారి పర్యవేక్షణలో చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. చెరువుల లోపల నియంత్రణ లేకుండా, గోతులు తీస్తున్నారని, ఇకపై అలా జరగకుండా క్రమ పద్ధతిగా, చెరువు అభివృద్ధి చెందేలాగా మట్టిని తీసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి గండి లేకుండా, పర్మిషన్ తో అధికారుల పర్యవేక్షణలో మట్టిని తరలించే విధంగా, చర్యల చేపడతామన్నారు. అదేవిధంగా వింజమూరు నుండి నంది గుంట కు వెళ్లే రహదారి పక్కన ఎడమ చేతి వైపు ఉన్న ప్రభుత్వ భూమిలో నుడా లేఅవుట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చి, తద్వారా వింజమూరు అభివృద్ధికి కృషి చేయాలని ప్రణాళిక చేసామని, ఆ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా జలదంకి మండలంలో భూ వివాదం జరుగుతుందని అక్కడికి వెళ్లి పరిశీలించి, ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. కనుక అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.