

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 18 :///
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన ఎరువులు , విత్తనాలు, సబ్సిడీ రుణాలను సకాలంలోఅందించేందుకు కృషిచేసి వారి సేవలో తరిస్తానని కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి రంగారావు పేర్కొన్నారు.సోమవారం కలిగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కదిరి రంగారావు, డైరెక్టర్లుగా, సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా నియోజకవర్గంలోని కూటమి నేతలు చైర్మన్ కదిరి రంగారావు, డైరెక్టర్లు సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులను, శాలవాలు పూలమాలలతో, ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు నాపై నమ్మకంతో, ఈ గురుతుర బాధ్యతను అప్పగించారని, ఈ పదవిని సేవకుడిగా భావించి, వమ్ము చేయక రైతులకు సేవ చేస్తూ తరిస్తానని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు రుణాలను అందిస్తానన్నారు. నాకు సహకరించిన కూటమి నేతలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, పార్టీ అధ్యక్షులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, చీమల తాతయ్య, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులి చర్ల వెంకటనారాయణ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు మేకపాటి మాల్యాద్రి నాయుడు, ఆండ్రా పరంధామ రెడ్డి సీఈఓ మానస బిజెపి మండల కన్వీనర్ లు లెక్కల వెంగళరెడ్డి, చుండి హరి గోపాల్, డేగా మధు యాదవ్, మాలేపాటి మల్లికార్జున, ఆవుల రోశయ్య యాదవ్, ఇతర నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.