

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్
పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.
ప్రజా ఉపయోగాల స్థలాలు లో బడి, గుడి, పార్కు, ఇతర ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలి అయితే కార్యదర్శి ఏకంగా పంచాయతీరాజ్ చట్ట విరుద్ధంగా స్థలాన్ని ఆయన భార్య పేరుట నిర్మించి దీనికి సంబంధించిన ఇంటి పన్ను రసీదు సైతం ఇచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి పంచాయతీరాజ్ చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇళ్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పి జి ఆర్ ఎస్ లో ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగా మధుబాబు ఫిర్యాదు చేశారు మండల ప్రజా పరిషత్ అధికారి స్పందించి సోమవారం విచారణ ఎదుట ఫిర్యాదుదారున్ని, బాధ్యుణ్ణి, తగిన ఆధారాలతో హాజరు కమ్మని ఆదేశించారు ఈ క్రమంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విచారణ చేపట్టారు సహజ న్యాయ సూత్రానుసారంగా ఫిర్యాదిని బాధ్యుడైన అధికారిని ప్రశ్నించారు.
దీనికి సంబంధించిన ఇంటి పత్రాల తాలూకు దస్తావేజులను సమర్పించాలని కోరారు.