

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రతీ వ్యక్తి తన పుట్టినరోజు న ఖచ్చితంగా మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ అన్నారు.తన తమ్ముడు కుమార్తె(రిషిత)8 వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ఆవరణంలో సోమవారం మొక్క ను నాటారు. ఈ సందర్భంగా కోరిప్రోలు సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరిగే శుభకార కార్యక్రమాలకు పుట్టిన రోజు న కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలు ఒక తీపి గుర్తుగా ఉండడమే కాకుండా మొక్కలు తిరిగి మనకు మంచి గాలిని, పళ్లను,పరిసరాలకు అందాన్ని ఇస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ, సూర్య కుమారి,స్కూల్ ప్రిన్సిపాల్ బి ప్రసాద్, ఈవో విజయ్, పాల్గొన్నారు