

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:-నేటి యువత స్వయ సంకల్పంతో ముందుకు ఎదగాలనే దృఢమైన ఆలోచన కలిగి వ్యాపారాలలో ఎక్కువ మక్కువ చూపుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి చాణుక్య హాస్పిటల్ వెనుక సాయి జ్ఞానేశ్వర ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి యువత చాలా ప్రాముఖ్యమని, ఉన్నతమైన విద్యను అభ్యసించి పరిశ్రమలు స్వయ వ్యాపారాలు చేయడానికి ముందుకొస్తున్నారని, దేశ భావితరాల భవిష్యత్తు యువతతోనే సాధ్యమని, యువ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, సూచించారు. సాయి జ్ఞానేశ్వర ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారం అభివృద్ధి చెందాలని సాయి జ్ఞానేశ్వర ఫ్లెక్సీ ప్రింటింగ్ సిబ్బందిని ఆశీర్వదించారు. అనంతరం సాయి జ్ఞానేశ్వర సిబ్బంది జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) ను ఘనంగా సన్మానించి అన్నవరం సత్యదేవుని చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు కుమార్, తదితర నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.