

తవణంపల్లి నవంబర్ 29 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని అరగొండ గౌరీ శంకర కళ్యాణ మండపం నందు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మామిడిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మామిడిలో ప్రధాన సమస్యలు తేనె, మంచు, తామర, పండు ఈగ, బూడిద తెగులు, వీటి పద్ధతుల గురించి తెలుపుతూ రైతులు మందులను విడతల వారిగా పిచికారి చేయు మందులు ను క్షుణ్ణంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన సమస్య తేనె, మంచు పురుగు, ఉధృతి, నివారించుటకు పైజిన్ 25 ఈసీ మందు ఒక లీటరు నీటికి 1.5 ఎం.ఎల్ గాని బప్రో పై జిన్ 20 ఈసీ వీటితోపాటు ఎసిపేట్ 50శాతం,డబ్ల్యుపి మందుకు ఒక గ్రాము లీటరు నీటికి, లేదా అజాక్సీ స్ట్రోబిన్ 23శాతం ఎస్ సి మందు, ఒక ఎం.ఎల్ లీటరు కలిగిన నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. అనంతరం మామిడిలో కవర్లు కట్టడం వలన పంట దిగుబడి అధికంగా నాణ్యత కలిగి మార్కెట్ లో అధిక ధరతో మంచి డిమాండు పెరగడానికి అవకాశం ఉంటుందని రైతులు ఈ పద్ధతిని అవలంబించి పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల కీటక శాస్త్రవేత్త రామయ్య, ఏ పి ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం, జడ్పిటిసి భారతి మధు కుమార్, స్థానిక సర్పంచ్ మల్లు దొరై, ఉద్యాన అధికారి సాగరిక, వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్, మండలంలోని మామిడి రైతులు పాల్గొన్నారు.