ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మికి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్,మా సమస్యల్ని పరిష్కరించండి వినత పత్రం

మన న్యూస్ పాచిపెంట జులై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి కొత్తకోట పార్వతీదేవి అధ్యక్షులు దాలమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కార్యదర్శి శ్రామిక మహిళా నాయకులు కే పార్వతీదేవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ బాలింతలు పిల్లలకు అందిస్తున్న సరుకులు వాసన రాకర్ బాల సంజీవిని యాప్లు ద్వారానే ఇవ్వాలని నిర్ణయించారు. బియ్యం పప్పు ఆయిల్ గుడ్లు, బాల సంజీవిని కిట్లు మరియు బాలామృతం తత్తర సరుకులను ఒక్కసారిగా రావడం లేదు ఈ సరుకులు ఇచ్చేటప్పుడు అంగనవాడి వర్కర్ ఫోటోలతో పాటు లబ్ధిదారుల ఫోటోలు తీసి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్నల్స్ లేక ఫోన్లు పని చేయకపోవడం తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు, సరుకులు పంపిణీ మొత్తం ఆన్లైన్ ద్వారా జరగాలని అధికారులు పెట్టే ఒత్తిడితో ప్రీస్కూల్ దెబ్బతింటుందని అన్నారు. ఎప్పటికైనా ఇటువంటి యాప్లన్ని కూడా రద్దు చేయాలని కోరారు ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్ దాలమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కనీస వేతనాలు అయిన ఇవ్వాలని అన్నారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. అంగన్వాడి సెంటర్లకు 2021 లో ఇచ్చినటువంటి ఫోన్లు 90% చెడిపోయని యాపలకు నిర్వహించవలసిన నెట్ స్పీడు ఇవ్వడం లేదని ఇటువంటి పరిస్థితుల్లో అధునాతనమైనటువంటి సెల్ ఫోన్లు అందించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి రాజకీయ ఒత్తిడి లేకుండా ముందుకు నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు ఎఫ్ఆర్ ఎస్ యాప్ లు వెంటనే రద్దు చేయాలని ప్రీ స్కూల్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి బి అనంతలక్ష్మి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి అనంతలక్ష్మి మాట్లాడుతూ పై సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలింతలతోపాటు ప్రాజెక్టు నాయకులు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు, వై.రమ దేవి అంగన్వాడి ఉద్యోగుల సీనియర్ నాయకులు టి ప్రభావతి, ఆలగరువుసీత సాయి పూజ, ఎన్ బంగారమ్మ, పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా