

గూడూరు, మన న్యూస్ :- జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలకు జి.ఓ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు ఎ.పి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు, తమ సమస్యల పరిష్కారం కొరకు సమ్మె లోనికి వెళ్లి ఆదివారానికి 8 వ రోజుకు చేరుకుంది. అదే బాటలో పారిశుధ్య కార్మికుల సమ్మె బాట పట్టి 5 వ రోజుకు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతభత్యాలు పెంచాలని, సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఫెడరేషన్ నాయకులు తో చర్చలు జరిపి న్యాయం చేయాలని, కాలయాపన చేస్తే సమ్మెను ఉధృతం చేస్తామని, కార్మికుల సహనాన్ని పరీక్షించవద్దని వారు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం జిల్లా కార్యదర్శి దారా కోటేశ్వరరావు,మున్సిపల్ సంఘం అధ్యక్షులు భూలోకం రమేష్,గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,భూలోకం మురళి,యన్.వెంకటరమణయ్య, కె.పోలయ్య,కె.పద్మమ్మ, ఓ.వరలక్ష్మి.డి.మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.