మన న్యూస్,తిరుపతి :-నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం శ్రీ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు శాలువ తో సత్కరించి శనివారం రేణిగుంట విమానాశ్రయంలో రుద్రకోటి సదాశివం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల వేతనం 25వేలకు పెంచడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 2 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ పై సీఎంతో చర్చించినట్లు చెప్పారు. నాయి బ్రాహ్మణుల కులవృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు ఇతర కులాలవాలు ప్రవేశించడంతో నాయి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆయా కార్పొరేట్ సంస్థలపై తగు చర్యలు తీసుకోవాలని కోరమన్నారు. నాయి బ్రాహ్మణులను ఎవరైనా కులం పేరుతో దూషిస్తూ సామెతల పేరుతో అవమానపరిచిన నాయి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు వారికి శిక్షలు పడేలా చూడాలన్నారు. నాయి బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాలవారీగా నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని కోరుతూ గతంలో ఇచ్చిన జీవోలు 13, 14 అమలు చేయాలని సీఎంకు విన్నవించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *