

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పురపాలక సంఘం పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహిస్తున్న 40 మంది ఆర్పీలకు ట్యాబ్ లు సాలూరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా రిసోర్స్ పర్సన్స్ లకు ట్యాబ్ లను లను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ మెప్మా ఆర్పీలు ద్వారా పొదుపు సంఘాలకు అందించే పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రజలకు అందుతాయి. ప్రభుత్వ సర్వేలు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో కమిషనర్ బి.వి. ప్రసాద్ . మున్సిపల్ మేనేజర్ శివ ప్రసాద్ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పుష్ప , ఆర్పీలు పాల్గొన్నారు.