

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రహదారుల దుస్థితి గురించి మంత్రికి వివరించిన ఎమ్మెల్యే కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారుల దుస్థితి గురించి మంత్రి గారికి వివరించిన ఎమ్మెల్యే గారు, కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విజ్ఞప్తికి మంత్రి వెంటనే స్పందించి రూ. 32.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా,రహదారి పనుల ప్రారంభోత్సవం కోసం ఈ నెల 7వ తేదీన మంత్రి స్వయంగా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించి, ప్రజలకు ప్రయోజనం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.