

మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.
వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు, గేట్లను పూర్తిగా సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.వరద నీరు అధికంగా వచ్చిన సమయంలో నీటిని దిగువకు వదిలేందుకు చర్యలు సిద్ధంగా ఉండాలన్నారు.నీటి నిల్వ సామర్థ్యం, ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.సీఈ వెంట ప్రాజెక్ట్ ఎస్ఈ రాజశేఖర్,ఈఈ సోలోమన్, ఏఈలు శివకుమార్,అక్షయ్, సాకేత్ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.
