మన న్యూస్ నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా : తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీస్ పథకం ఈఎంఆర్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది 24×7 అందుబాటులో ఉండి ఏ ఏ ప్రమాద బాధితుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం వచ్చిన క్షణంలో ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని మేము మీకు ఆపద్బాంధవుల్లాగా సహాయం చేస్తాము అలాంటి ఆపద్బాంధవులకు ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో 108 అంబులెన్స్ సిబ్బందికి గత రెండు నెలల( జూన్, జూలై ) నుంచి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో, ఉద్యోగుల యొక్క కుటుంబాలు పోషించడానికి భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందర్లోనే ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే జీతాలు రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి మరియు ఆరోగ్య శాఖ మంత్రి గారికి వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *