మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను ధన్వాడ శివారులో టాస్క్ ఫోర్స్ ధన్వాడ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా డ్రైవర్ పేరు నరేందర్ s/o ఉష, అప్పిరెడ్డిపల్లి, ఓనర్ వెంకటేష్, షేర్నపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని అక్రమంగా ఇసుక తరలిస్తున్నందున డ్రైవర్ ఓనర్లకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు నిర్వహించి మరికల్ శివార్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా డ్రైవర్ పేరు ప్రకాష్ s/o కాంతులు, ఓనర్ నాగరాజు, రాకొండ గ్రామానికి చెందిన వ్యక్తి అని అక్రమంగా ఇసుక తరలిస్తున్న డ్రైవర్ ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మరికల్ ఎస్సై రాము తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *