వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : ప్రత్తిపాడు నియోజకవర్గం లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామం, ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం గ్రామాల్లో గిరిబాబు పర్యటించి లింగంపర్తి గ్రామంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగంపర్తి గ్రామానికి చెందిన తిబిరిశెట్టి త్రిమూర్తులు ను గిరిబాబు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భద్రవరం గ్రామానికి చెందిన మెంటే లచ్చారావు మాతృమూర్తి ఇటివల కాలంలో మరణించడం తో లచ్చారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామంలో కొండి సీతారాం ఇటీవల కాలంలో మన్నించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టి రాయవరం గ్రామంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గిరిబాబు ను కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల పేరుతో హామీలు ఇచ్చి ఏడాది పాలన పూర్తయిన అమలు చేయకుండా అమలు చేసామని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రామిశెట్టి నాని, వైస్ ఎంపీపీ బంకు శ్రీను, ఎంపీటీసీ తటవర్తి రామన్న దొర, బత్తుల నాగార్జున, కొండి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *