• హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు
  • వైసిపి కో ఆర్టినేటర్ ముద్రగడగిరి బాబు

శంఖవరం / ప్రత్తిపాడు మనన్యూస్ (అపురూప్) : చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా ఆరాచకమే అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్ లెట్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ల జగనన్న పాలనను చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారన్నారు. జగనన్న హాయంలో రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హుల ఆకౌంట్లలో నిధులు జమ అయ్యాయన్నారు. రెండేళ్ల కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత జగనన్నకే దక్కిందన్నారు. ఏడాది పాలనలో మహిళలను దగా చేశారని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి సురేష్, గొల్లపల్లి కాశి, గుమ్ములూరి రమణ, యిజనగిరి ప్రసాద్, అల్లం ఆదినారాయణ, మజ్జూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *