మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం లో
సత్రం పంపు వీధిని ఆనుకొని ఉన్న,లింగంపర్తి లోని ఏడు వార్డులకి సంబంధించిన స్మశాన వాటిక ను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, లింగంపర్తి నాయకులు గొంప శివకుమార్ యాదవ్, తదితరులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గొంప శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ, లింగంపర్తి రుద్ర భూమిని ఆక్రమించుకున్నారని తెలిసితాము పంచాయతీ సెక్రెటరీకి ఎమ్మార్వో కి ఫిబ్రవరి నెలలో 25వ తారీఖున కంప్లైంట్ అవ్వడం జరిగినదనీ స్మశాన వాటిక రెండు ఎకరాల 11 సెంట్లు స్థలం సర్వే చేసి రుద్రభూమిని పంచాయతీ కి అప్పచెప్పాలని కోరడం జరిగినదనీ అలాగే ఎమ్మార్వో కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఏమి పట్టనట్టు దానిపై యాక్షన్ తీసుకోకుండా నీరు కారుస్తూ ఉన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ కి,స్మశాన వాటిక కోసం ఫిర్యాదు చేయడం జరిగింది లింగంపర్తి లో ఉన్న 7 వార్డులకు సంబంధించిన స్మశాన వాటికను సర్వే చేపించి ఆక్రమించిన వారు తొలగించి స్మశాన వాటిక ను పంచాయతీ జిల్లా ఏసీ గారిని కోరడం జరిగింది ఆర్ డీ వో కి,ఎమ్మార్వో కి,ఎండి కి,పంచాయతీ సెక్రెటరీకి,మీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ పంపించి,ఈ స్మశాన వాటిక ను లింగంపర్తి పంచాయతీకి అప్పచెప్పుతారని కోరుకుంటూ గొంప శివకుమార్ యాదవ్,పొట్టపల్లి వేణు,పొట్టపల్లి బుజ్జి,కృష్ణ,సూరిబాబు,స్వామి,బాబు తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *