మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ విభాగాల కమిటీల్లో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శిగా ఏలేశ్వరం నగర పంచాయితీ వైసీపీ నాయకుడు బదిరెడ్డి గోవింద్ ని నియమించారు.తనకి ఈ అవకాశం కల్పించిన పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభంని,వైసీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబుని కిర్లంపూడిలో వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాల వేసి ఘన సన్మానం చేశారు.అలాగే ఇటీవల ఏలేశ్వరం నగర పంచాయితీ నుండి పార్టీ కమిటీల్లో నియమించిన వారిని బదిరెడ్డి గోవింద్ ఇంచార్జి ముద్రగడ గిరిబాబుకి పరిచయం చేసారు.ఈ సందర్బంగా పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని గిరిబాబు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్,మండలం పార్టీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,ఉపాధ్యక్షుడు డేగల చంద్రమౌళి, పేకల జాన్,జెవిఆర్ ట్రస్ట్ చైర్మన్ జువ్విన వీర్రాజు,ఏలేశ్వరం పట్టణ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు లోగీసు శేఖర్,ఏలేశ్వరం ఆర్టిఐ వింగ్ అధ్యక్షుడు దత్తి రాజా,ఏలేశ్వరం పట్టణ మైనారిటీ వింగ్ అధ్యక్షుడు డి నూరిన్ ఖాన్,యూత్ వింగ్ అధ్యక్షుడు ఈపి రాము,పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు దనేడి సురేష్, ప్రధాన కార్యదర్శులు సిరిపురపు రాజేష్ రాజేష్,గొడుగు నాగేంద్ర, కార్యదర్శులు వాడపల్లి శ్రీను,దత్తి రామకృష్ణ,భీశెట్టి రాజా,రెడ్డి రాజా సభ్యులు పప్పల సింహాద్రి,పతివాడ జగదీశ్వరరావు,బంగారు రాజు, రౌతు శ్రీను,చందక్ శేషు,రేపాక నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *