కడపలో జరిగే మహానాడు పై మంత్రులు పొంగూరు నారాయణ, ఆనంరామనారాయణరెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు, మే 24: కడపలో ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని.. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారిద్దరు చర్చించుకున్నారు. రాష్ట్ర మహానాడుకు జిల్లా నుంచి 50 వేల మంది తరలి వస్తారని అంచనా వేశారు. అందుకు సంబంధించిన రవాణా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారని.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టిడిపి నేత బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..