

మన న్యూస్,తిరుపతి, : వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పదోతరగతి ఆ పైన చదివినటువంటి యువకులకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారని, మాస్ సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. యువకులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జి కలిగిన వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్లు గాను, మాజీ సైనికులు అయితే వారికి సెక్యూరిటీ సూపర్వైజర్లుగా తీసుకోబడునని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు బైరాగి పట్టెడలోని శ్రీ పద్మావతి పార్కు వెనుక వైపున ఉన్నాం మాస్ కార్యాలయంలో దరఖాస్తులను నేరుగా వచ్చి అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9392275861 నెంబర్ లో సంప్రదించాలని జ్ఞాన శేఖర్ రెడ్డి కోరారు.