నెల్లూరు జిల్లాలోని మైన్స్ లో విపరీతంగా జరుగుతున్న బ్లాస్టింగ్ ను గురించి అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పెరిగిపోతున్న హత్యలను నివారించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం అందజేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 16: నెల్లూరు జిల్లాలోని మైన్స్ లోఅడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్స్ ను నివారించాలని అలాగే నెల్లూరు సిటీ పరిధిలో మద్యం మత్తులో జరుగుతున్న హత్యల పట్ల కఠినచర్యలు తీసుకొని అడ్డుకట్టకట్ట వేయాలని కోరుతూ శుక్రవారం వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు వైసీపీ సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా గత ఆరు నెలలుగా జిల్లాలో పెరుగుతున్న క్రైమ్ రేటు ను గురుంచి.. జిల్లాలో పెరిగిపోతున్న అసాంఘిక శక్తులు రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్ ను నిర్మూలించాలని జిల్లా ఎస్పీ ని వారు కోరారు.జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ లో బ్లాస్టింగ్స్ విపరీతంగా చోటు చేసుకోవడంపై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశామని వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇలా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న ముఠా ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీనికోరేమన్నారు.ముఖ్యంగా సైదాపురం మైన్స్ లో ఈ బ్లాస్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా వీటిని కట్టడి చేయాలని జిల్లా ఎస్పీ గారిని కోరామని తెలిపారు. అలాగే జిల్లాలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ కు కూడా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ కి విన్నవించామని తెలిపారు. అవసరమైతే ఈ బ్లాస్టింగ్స్, అక్రమ మైనింగ్ పై కోర్టుకు వెళ్లి దీని వెనక ఎంత పెద్ద వారు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….నెల్లూరులో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఈ విషయం జిల్లా ఎస్పీ గారికి తెలియజేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. యువత మద్యానికి బానిసై.. కత్తులు పెట్టుకొని తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కల్చర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేదని.. గడిచిన ఆరు నెలల్లోనే ఇలాంటి కల్చర్.. పుట్టుకొచ్చిందన్నారు.గడిచిన ఆరు నెలల్లోనే జిల్లా లో 20 కి పైగా హత్యలు జరగడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ హత్యలు పాత కక్షలు ఆధారంగా గాని.. ఒకరిపై ఒకరునిందించుకొని …జరిగినవి కావని.కేవలం మద్యం మత్తులో క్షణికావేశంలో జరిగినవే నన్నారు. నెల్లూరులో కిరాయి హంతకుల కల్చర్ పెరిగిందన్నారు. ఇలాంటి వారే.. రౌడీలుగా గుండాలుగా, గంజాయి బ్యాచ్ గా చలామణి అవుతూ.. ఇసుక రీచ్ ల వద్ద.. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ రౌడీ గ్యాంగ్, గంజాయి ముఠా పై.. జిల్లా పోలీసులు నిఘా ఉంచి.. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలన్నారు.నెల్లూరు నగర విషయానికొస్తే..సిటీ అవుట్ స్కట్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని.. ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయని జిల్లా ఎస్పీకి వివరించామన్నారు.దీనిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ ని కోరామని తెలిపారు.ఇలాంటి అసాంఘిక ఘటనల వెనుక ఎలాంటి రాజకీయ శక్తి ఉన్న.. ఉపేక్షించకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఎస్పీ ని కోరడం జరిగింది అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో.. ఈ విధమైన కల్చర్ చోటు చేసుకోకుండా.. పోలీసులు గట్టి నిఘ ఉంచాలన్నారు. నెల్లూరు జిల్లాను మల్లి ఒక ప్రశాంతమైన జిల్లాగా.. ఉండే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే.. వైఎస్ఆర్సిపి ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మళ్లీ నిర్మల, వైసిపి మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, కార్పొరేటర్లు వేలూరు ఉమామహేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 11 డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్,వైసిపి 42 వ డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..