గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 16జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, కంచుపాడు గ్రామంలో జన్మించిన సురవరం కుటుంబం నడిగడ్డకు ఒక వరంలాంటిది. ముందుగా ఆకుటుంబంలో ప్రముఖ సాహిత్యకారుడు తెలంగాణ ఉద్యమ జ్యోతి బహుముఖ ప్రజ్ఞాశాలి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు నైజామును ఎదిరించి పోరాడిన ధీశాలి తెలంగాణ విముక్తి కోసం అక్షరమే ఆయుధంగా పోరాడిన అత్యంత ప్రతిభాశాలి ఆయన కుటుంబం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం దేశ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అలుపెరుగని పోరాట యోధుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి , ఏ.ఐ.ఎస్. ఎఫ్ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఢిల్లీ కళాశాల నాయకునిగా జాతీయ అధ్యక్షుడు గా ప్రధాన కార్యదర్శిగా ఎదిగి పెదలకోసం కేసులు, జైల్లని ముద్దాడి ఆతర్వాత సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉండి రెండుసార్లు ఎంపీగా దేశానికి సేవలు అందించిన అతిరథ మహారతుడు సురవరం సుధాకర్ రెడ్డి ఈ మధ్య కాలంలో అస్వస్థతకు గురయినాడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ రెడ్డి సొంత గ్రామం కంచుపాడులో మేము పరామర్శించడం జరిగింది. సిపిఐ జాతీయ నాయకులు పార్లమెంటరీ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు జరగడానికి కారణమైన వ్యక్తులలో ఆయన ఒకరు నిరుపేదల పట్ల జాలి దయ కలిగి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసి వారి ఆకలి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకం ఇతర అనేక కార్మిక రైతు చట్టాల రూపకల్పనలో గణనీయమైన పాత్ర నిర్వహించాడు. దళితుల కోసం కొంత భూమిని త్యాగం చేసిన ఘనుడు,అటువంటి యోధున్ని నేడు పరామర్శించడంతో గొప్ప అనుభూతుని పొందామని సురవరం తో కలసిన ఈసందర్భంగా నాగర్ దొడ్డి వెంకట్రములు, బి ఆంజనేయులు తెలిపారు. ఆయన సతీమణి ఆయనకు ఉద్యమాలలోనే కాదు పార్టీ కార్యక్రమాల్లో చేతోడు వాదోడుగా ఉంటూ నేటికీ ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆయన కొడుకు కోడలు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన త్వరగా కోలుకోవాలని నడిగడ్డలో ఇటువంటి ఉద్యమ నాయకుడి కలవడం సంతోషమనీ వారు వ్యక్తం చేశారు. వారి వెంట ఎర్రవల్లి రఘునాథరెడ్డి తదితర మిత్రులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *