
మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 15:విద్యార్థిదశ నుంచి ప్రజాసేవ చేసే కుటుంబ నేపథ్యంతో,రాజకీయాల్లో పెను సంచలనంగా అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే రికార్డుస్థాయి మెజారిటీ సాధించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న మన ప్రియతమ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలకు గుర్తిస్తూ నన్ను బుచ్చిరెడ్డిపాళెం గ్రామీణం మండల అధ్యక్షుడిగా నియమించిన మాతృ సమానురాలైన మా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నా పై నమ్మకంతో నాకు అప్పగించిన బుచ్చి గ్రామీణం మండల టిడిపి సారధ్య బాధ్యతలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆశీస్సులు, నాయకులు మరియు కార్యకర్తల సహాయ సహకారాలతో సమర్ధవంతంగా నిర్వహిస్తాను. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోనికి తీసుకెళ్ళి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా,నిరంతర సేవామూర్తులైన వేమిరెడ్డి దంపతుల సేవాస్పూర్తి ఆలంబనగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ఈ సందర్బంగా మాతృసమానురాలైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మరియు నన్ను రాజకీయంగా ప్రోత్సాహించే సోదర సమానులు డాక్టర్ అర్జున్ రెడ్డి కి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సాహించే నా శ్రేయోభిలాషులు సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కి కోడూరు కమలాకర్ రెడ్డి కి , బెజవాడ వంశీకృష్ణా రెడ్డి కి ఈ సందర్బంగా ధన్యవాదాలు అని బెజవాడ జగదీష్ మండల అధ్యక్షుడుబుచ్చిరెడ్డిపాలెం గ్రామీణం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
