మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 15: *మే 15వ తేదీ 9గం॥ లకు ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తలచేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు.*మొత్తం 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో షుమారు 70 వేల మంది ప్రజలు పాల్గొన్నట్లు అంచనా. *పట్టుదలకు మారుపేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ.*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.*ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఆషామాషీ కాదు. శానమండలి సభ్యులు బీద రవిచంద్ర. *”339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితం” రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15:నెల్లూరు కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ 24వ డివిజన్లో జరిగిన ప్రారంభోత్సవాలలో మునిసిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర , జిల్లా కలెక్టర్ O. ఆనంద్, IAS , నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు స్రవంతి, స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి , రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వేలాది మంది ప్రజలతో కలసి పాల్గొన్నారు. పట్టుదలకు మారుపేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే పొట్టేపాలెం, ములుముడి బ్రిడ్జీలు త్వరలోనే మంజూరు అని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడు అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఆషామాషీ కాదు అని శానమండలి సభ్యులు బీద రవిచంద్ర అన్నారు.ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనాయకుడు నారా లోకేష్ కి, ఓటువేసి 3వసారి ఎమ్.ఎల్.ఏగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, కష్టం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. “339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితం” అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *