
మన న్యూస్, ఇందుకూరు పేట ,మే 15:నా పై నమ్మకం వుంచి నన్ను ఇందుకూరుపేట మండలతెలుగుదేశం పార్టి అధ్యక్షుడిగా నియమించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందుకూరుపేట మండల టిడిపి నాయకులు మరియు కార్యకర్తల సూచనల, సలాహాలు స్వీకరిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో అమలవుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తానని తెలియ చేసుకుంటున్నాను. ఈ సందర్బంగా నన్ను రాజకీయంగా వెన్ను తట్టి ప్రోత్సాహించే సోదర సమానులు నా శ్రేయోభిలాషులైన సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కి, కోడూరు కమలాకర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను అని ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్నికైన ఏ కొల్లు పవన్ రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
