


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు.తమ చిన్ననాటి మిత్రులతోకలిసిజ్ఞాపకాలనునెమరేసుకున్నారు.రోజంతా ఉల్లాసంగా ఆనందంగా గడిపారు.అనంతరం ఉపాధ్యాయులకు రక్షణ కాంత్,ఆంజనేయులు,సుభాష్, వెంకటేశం,వెంకట్,నశ్రీన్ లకు విద్యార్థులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలలో చదివి ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకచోట పనిచేసుకుంటూ మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుకున్న వారు ఎక్కడైనా బతకగలమని మనోధర్యం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాము రాథోడ్,అజీమ్ హర్షత్ ,గంగరాజు,యాద గౌడ్,
స్రవంతి,వాణి,సుమలత,రూప రాణి,అనిల్ రెడ్డి,సి.హెచ్ శేఖర్ ,కిరణ్ కుమార్
,హనుమంత్,కాశీనాథ్,దత్తు,తదితరులు ఉన్నారు.




