• రౌతులపూడి లో ముద్రగడ పర్యటన..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో గిరిబాబు వీరబాబును పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకొని పార్టీకి సేవలు అందించాలని కోరారు. కార్యకర్తలు అభిమానులతో గిరిబాబు పార్టీకి సమన్వయంతో అందరం కష్టపడి పని చేద్దామని రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ను చేసే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేద్దామని పార్టీలో అందరం కలిసి పని చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని గిరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మధుబాబు, పులి మధుబాబు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *