

ప్రతి విద్యార్థి సేవాభావంతో మెలగాలి ఎస్సై సుమన్
Mana News:- మన న్యూస్ ,ఎస్ఆర్ పురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకంలా ఉంటుందని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు.గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా కొత్తపల్లిమిట్ట ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థుల బకెట్లను, బోధన సామాగ్రి నీ విద్యార్థులకు ఎస్సై సుమన్ అందించారు. విద్యార్థులు చదువుతోపాటు సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ నేను ఒకప్పుడు హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని హాస్టల్లో ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ గోవింద్ జయరాం, హాస్టల్ సిబ్బంది జయపాల్ తదితరులు పాల్గొన్నారు.