అత్త సొమ్ము..అల్లుడి దానం

నిధులు కేంద్రానివి..సోకులు రాష్ట్రానివి

రేషన్ బియ్యం పై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం

5కిలోలు కేంద్ర ప్రభుత్వం,1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. వాడవాడల కాంగ్రెస్ నేతలు,ప్రజా ప్రతినిధులు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అద్భుత పథకంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.ఈ సందర్భంగా బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ” సొమ్మొకడిది..సోకొకడిది”అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడుస్తుందని, పేద ప్రజలకు ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో మాత్రమే ఇస్తుందని, కరోనా సమయం నుండి కేంద్ర ప్రభుత్వమే ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా తామే పూర్తిగా భరిస్తున్నట్లు,మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని,తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రేషన్ బియ్యం పథకం కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఖర్చు చేయడం అక్షర సత్యమని,కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు..చేసే పనులకు పొంతన లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పదివేల కోట్లు భరిస్తుందని బహిరంగ సభలలో చెప్పడం సిగ్గుచేటని బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి గారు మండిపడ్డారు. అదేవిధంగా ప్రజా సంక్షేమం,అప్పులే పుట్టట్లేదు,ఖజానా ఖాళీ అయింది,అని చేతులెతేసిన మీకు సన్న బియ్యానికి డబ్బులెక్కడ నుంచి వచ్చినవి అని ఈ సందర్భముగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..ప్రజాపాలన,అని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు తాము ఇచ్చిన ఎన్నికల హామీలు కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళా భరోసా కింద ప్రతి మహిళకు 2500 నగదు,4,000/- వృధాప్య పింఛన్ ఇవ్వలేదు, కౌలు రైతులకు 12,000/- ఇవ్వలేదు, మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు,పూర్తిగాని రైతు భరోసా, ఇలా అన్ని పథకాలు పక్కకు పెట్టి,అత్త సొమ్ము అల్లుడు దానంఅన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందని,త్వరలోనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధిని,ప్రజలకు జరుగుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి సత్తా ఏంటో తెలుస్తుందని బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు