

మనన్యూస్,నెల్లూరు రూరల్:జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం.ఈ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికం అత్యంత ఆధునిక వసతులతో ఏర్పాటుచేస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ తో ప్రజలకు మేలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో 24 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను శుక్రవారం పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికం.అత్యంత ఆధునిక వసతులతో ఏర్పాటుచేస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ప్రజలకు మేలు చేస్తుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జులై 30వ తేదీ లోపల దీనిని పూర్తిచేసి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
