మనన్యూస్,నెల్లూరు,రూరల్:నియోజకవర్గం లోని 19వ డివిజన్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షబ్బీర్ ను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నగరంలోని హరినాధపురంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న షబ్బీర్ ను మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ముస్లిం మైనారిటీ నేత షేక్ షబ్బీర్ ను పరామర్శించిన వారిలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య,పాశం శ్రీనివాస్, హరిబాబు యాదవ్, యేసు నాయుడు, మల్ల సుధాకర్ రెడ్డి, వై వి రెడ్డి, కొండేటి నరసింహారావు, స్వర్ణ జీవన్ ప్రసాద్, శ్రీధర్ బాబు, కల్లూరు లక్ష్మీరెడ్డి, నాగ శ్రీనివాసులురెడ్డి, షేక్ అల్లా బక్షు, షేక్ జిలాని, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు ఉన్నారు.
