

మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం నుంచి విద్యార్థులు పాల్గొని పథకాలను సాధించి, గ్రాండ్ ఛాంపియన్స్ గెలవడం జరిగిందని అన్నారు. అసమాన క్రీడలు ప్రదర్శించి బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు బి మాయ, దీక్షిత,నిహాల్, వర్షిత, దీక్షిత, వెండి పథకాలు సాధించిన వారు అక్షిత, వంశీకృష్ణ. కాంస్య పథకాలు సాధించిన వారు సంతోష్, నీతో, మోబినా, క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి బహుమతులను గెలపొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే వ్యవస్థాపకులు సలాంబినోమర్ టోర్నమెంట్ ఇన్చార్జి మహమ్మద్ సలీం కరాటే మాస్టర్లు ధరణి ధనుష్ కృష్ణాంగి దీక్షిత రక్షయ హర్షవర్ధన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
