

మనన్యూస్,బడంగ్ పేట్:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బడంగ్ పేట్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన నేనావత్ రాజు నేతృత్వంలో ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యాన్ని అభినందించారు.ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ యజమాని నేనావత్ రాజు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఒక నెల వరకు ఫ్రీ ఐ చెకప్ ఉంటుందని, హాయ్ చికిత్స తో పాటు స్పెక్ట్స్ కూడా అందరికి అందుబాటు ధరల్లో లభిస్తాయి అన్నారు. స్థానిక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి,ఏదుల ప్రతాప్ రెడ్డి, గోలి రంజిత్ రెడ్డి, గిరి ముదిరాజ్, అనిల్ గౌడ్, నిర్వాహకులు నేనావత్ విమల రాజు,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
