మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఆదివారం ఉదయం శ్రీ రాజరాజేశ్వరి క్లినిక్ మరియు శ్రీ సాత్విక్ మెడికల్ అండ్ ఫాన్సీస్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా డాక్టర్ చరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోజులలో ఆధునిక చికిత్స కోసం పల్లెటూరు నుండి పట్టణాలకు, నగరాలకు వెళ్లడం జరుగుతుంది.అందుకోసం పల్లెటూర్లో అతి తక్కువ ధరలతో తక్కువ ధరలకు మందుల తో ప్రజలకు సేవ చేయడానికి ఈ క్లినిక్ మెడికల్ అండ్ ఫాన్సీ ప్రారంభించడం జరిగింది అని అన్నారు.
డాక్టర్ రత్నం కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి అనుకూలంగా ఉండాలని ఉద్దేశంతో కాకుపల్లిలో 24 గంటలు ఆరోగ్య సేవలు అందించడానికి మా పిల్లలు శ్రీ రాజ రాజేశ్వరి క్లినిక్ మరియు శ్రీ సాత్విక్ మెడికల్ అండ్ ఫాన్సీస్ ప్రారంభించడం జరిగింది అని అన్నారు.ఇక్కడ ప్రజలకు ఆరోగ్యపరంగా సూచన సలహాలు ఇవ్వడం కోసం ఇక్కడ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నకుమార్, శివానందమూర్తి,నీరజారాణి డాక్టర్ ఉమా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.








