

MANA NEWS :- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మన న్యూస్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ……షాకిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు తరపున కృతజ్ఞతలు . రాష్ట్ర పదవుల్లో ముస్లిం మైనార్టీలకు ప్రముఖ స్థానం కల్పించినందుకు. ప్రభుత్వ మైనారిటీ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ కేటాయించిన “M.A,షరీఫ్” రాష్ట్ర మైనారిటీ ఫైనన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించిన “మౌలానా ముస్తాక్ అహ్మద్ . మైనార్టీ సంక్షేమం కోసం 4376 కోట్లు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ . రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం 4,376 కోట్లు కేటాయించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రయోజనం పొందే బడ్జెట్ను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.అలాగే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం చేసిందని హామీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు
కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మైనార్టీల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం దీనికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో మైనార్టీలకు మరింత న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి మైనార్టీలకు వెన్నంటే ఉంటారని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతారని తెలియజేశారు