మనన్యూస్,గొల్లప్రోలు:మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి రాజు పిఎం రాజులను అధినేత పవన్ కళ్యాణ్ నియమించినట్లు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రావు తెలియజేశారు. సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుపుకునే మొదటి పండుగను ఘనంగా జరుపుకోవాలని తెలియజేశారు. పిఎన్ రాజు చోడవరం ఇంచార్జ్ మాట్లాడుతూ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కమిటీలు నియమించడం జరిగిందని ఈ కమిటీల తో పాటు ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేశామని మీరందరూ సమన్వయంతో పనిచేసి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఘన స్వాగతం పలికి ఆతిథ్యాన్ని అందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *