మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:డ్రైవర్ ఎస్ వి రమణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో లో ఉన్న అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ యు బి ఎం కుమార్ మాట్లాడుతూ 1/2019 జీవోను డిపో మేనేజర్ తుంగలో తొక్కి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఫారోపించారు. మరొక జేఏసీ కన్వీనర్ కే త్రిమూర్తులు మాట్లాడుతూ 1/2019 జీవో కు వ్యతిరేకంగా డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్ జీవి రమణ ను జీవో కు వ్యతిరేకంగా సస్పెండ్ చేయడానికి నశిస్తూ గత 11 రోజులుగా ఎర్ర రిబ్బలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్నం డిపో గేట్ మీటింగ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న డిపో మేనేజర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ జీవో 1/2019 ‘ ఖచ్చితంగా అమలు చేసి డ్రైవర్ ఎస్ వి రమణ తిరిగి విధులలోనికి తీసుకోవాలని అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. డ్రైవర్లు పివి బాబు, సిహెచ్ వి ఎస్ నారాయణ నిరాహార దీక్షలో కుర్చుని సంఘీభావం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం గేటు మీటింగ్ వద్ద కార్మికులు 11వ రోజు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీసీ సంఘం, ఏపీ డి ఈ కోశాధికారి భీమన సూరిబాబు, ఎన్.వి. రావు, కే ప్రవిజ్, చలం, చిన్నబాబు, వీరవరం శ్రీను, ఎల్ ఎన్ రావు, జక్కా శ్రీను, ఎస్ ఎస్ కుమార్, మహిళా కండక్టర్లు రాజ్యలక్ష్మి, సిహెచ్ వెంకటలక్ష్మి, పల్ల ప్రసాద్ తదితరులు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *