

ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో మూడవ జాతీయ సదస్సు.
ఆర్ హెచ్ వి ఎస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులకు పుస్తక వితరణ
మనన్యూస్,తిరుపతి:త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన (ఆర్ హెచ్ వి ఎస్) సత్యసాయి జిల్లా అధ్యక్షులు జింక ఆంజనేయులు పిలుపునిచ్చారు.సోమవారం ఆయన తిరుపతిలోని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన కార్యాలయం సందర్శించి స్థానిక రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు తో చర్చించారు.త్వరలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే శ్రీరామ రథయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఎల్లుండు మధ్యప్రదేశ్ దాటియాలో జరిగే జాతీయస్థాయి మూడవ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.తిరుపతి నుంచి వెళ్లే రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్యామల,సుకుమార్ రాజు లకు ఆయన అభినందనలు తెలిపారు. హిందూ సనాతన ధర్మం,ఆధ్యాత్మిక వ్యాప్తికి భారతీయులు కంకణ బద్ధులై శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అన్నారు.తొలిసారిగా భారత దేశంలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీ రామ రథయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.భారతదేశంలో హిందూ భావజాలాలపై విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు.