

నిందితుడు వినోద్ సింగ్ అరెస్ట్.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ
రవీందర్ రెడ్డ
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు,దుర్గా ఇన్ఫ్రా కంపెనీ కార్మికుడు ముని ప్రసాద్ విశ్వకర్మ (32) హత్య కేసు మిస్టరీ ని పోలీసులు ఛేదించారు.దుర్గా ఓసి కంపెనీలో మెకానిక్ హెల్పర్ గా పనిచేస్తున్న ముని ప్రసాద్ విశ్వకర్మ ఫిబ్రవరి 27 రాత్రి కంపెనీ క్యాంపు సమీపంలో హత్యకు గురయ్యారు.కంపెనీ మేనేజర్ ముత్తు కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా డీఎస్పీ రవీందర్ కు రెడ్డి ఆధ్వర్యంలో సతీష్ కుమార్ తన బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం,డాగ్ స్క్యాడ్ లతో శరవేగంగా అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఎస్సై మేడ ప్రసాద్,ఎస్సై రంజి త్, ట్రైన్ ఎస్సై
మనిషాలతో కలిసి మూడు బృందాలుగా ఏర్పడిన పోలీస్ లు అనుమానిత ప్రదేశాలను పరిశీ
లించి,నిందితుని గుర్తించి అరెస్ట్ చేశారు.సోమవారం మణుగూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.