

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ లయన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని లయన్ క్లబ్ అధ్యక్షులు డి వి చారి తెలిపారు.విజన్ డిస్టిక్ చైర్పర్సన్ కడుమూరు శ్రీనివాస్ గారి సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వైద్య శిబిరంలో దాదాపు 60 మందికి కంటి పరీక్షలు చేయగా 57 57 మందికి సమస్యలు గుర్తించి శాస్త్ర చికిత్స అవసమని సూచించగా,42 మందిని కంటి ఆపరేషన్ కోసం పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించామని తెలిపారు.మిగతావారిని వచ్చే నెలలో తరలిస్తామన్నారు.కంటి ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచిత మందులు కళ్లద్దాలు అందించడం జరుగుతుందని తెలిపారు.మక్తల్ పరిసర ప్రాంత ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి అంజన్ ప్రసాద్,సభ్యులు మఠం వాదిరాజ్,మామిళ్ల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.