

మనన్యూస్,శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.సోమవారం మియాపూర్ డివిజన్ శ్రీల గార్డెన్ కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను జిహెచ్ఎంసి అధికారులు,కాలనీ వాసులతో కలసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేస్తున్నామని అన్నారు.డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని,సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు,పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సంతోష్,వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్,స్థానిక నాయకులు సంతోష్,నరేష్ నాయక్,కాలనీ వాసులు ఫణి కుమార్,చేతన్ కుమార్,గోపాల్,జశ్వంత్,నాగేశ్వరావు,ప్రవీణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.