

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకాలు, ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించరు.భక్తులు తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. బోనాల పండుగలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు తదితరులు ఉన్నారు.