మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో గల బీడీల మైసమ్మకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకుని భాజా భజంత్రీలతోని బీడీల మైసమ్మ వద్దకు చేరుకొని ప్రదక్షిణ నిర్వహించి మైసమ్మకు ఓడి బియ్యాన్ని సమర్పించారు. బోనాల పండుగలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఎమ్మెల్యే కు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు దుర్గారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ మనోహర్,మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి ,దేవేందర్ రెడ్డి తదితరులున్నారు.










