

ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు ఐవిఎఫ్ కే గర్వ కారణం..
ఐవిఎఫ్ ఢిల్లీ అధ్యక్షులు అశోక్ అగర్వా
మనన్యూస్,కామారెడ్డి:ఇంటర్నష్ణల్ వైశ్య ఫెడరేషనల్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహము ఆధ్వర్యంలో సంవత్సరకాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి సంస్థగా భారతదేశంలో నిలపడం అభినందనీయమని హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐవిఎఫ్ ఢిల్లీ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ అన్నారు.ఈ విజయానికి కారకులైన తెలంగాణ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు సేవాదళ్ చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ ఎర్రం చంద్రశేఖర్ లను అభినందించి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ దేశంలోనే ఇప్పటివరకు ఏ సంస్థ సాధించినటువంటి రికార్డును తలసేమియా చిన్నారుల కోసం రక్తాన్ని అందజేయడం ద్వారా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం జరిగిందని,చిన్నారుల ప్రాణాలను కాపాడు కోసం ఇప్పటివరకు 4500 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి తల సేమియా సికిల్ సెల్ సొసైటీ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలకు అందజేయడం సాధారణ విషయం కాదని సకాలంలో రక్తాన్ని అందజేస్తూ చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.